సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన శానంపూడి సైదిరెడ్డి బుధవారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన ఛాంబర్‌లో సైదిరెడ్డిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇటీవల ముగిసిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైదిరెడ్డి 43 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.